చెంచుల సమస్యలు పరిష్కరిస్తాం : కలెక్టర్
ABN, Publish Date - Jul 18 , 2025 | 11:21 PM
అటవీ ప్రాంతంలో నివసించే చెంచుల సమస్యలను పరిష్కరిస్తానని కలెక్టర్ రాజకుమారి హామీ ఇచ్చారు.
బండిఆత్మకూరు, జూలై 18(ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాంతంలో నివసించే చెంచుల సమస్యలను పరిష్కరిస్తానని కలెక్టర్ రాజకుమారి హామీ ఇచ్చారు. మండలంలోని నెమిళ్ళకుంట గూడెంలో శుక్రవారం సర్పంచ్ కంచర్ల శోభారాణి, ఉప సర్పంచ్ కంచర్ల చిన్న లింగారెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ తరపున ఆమె గృహోపకరణాల కిట్లను చెంచులకు అందజేశారు. అనంతరం చెంచులు అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాలు, ఆలయ మరమ్మతులు, మద్దిలేరువాగు వంతెన, పొలాలకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్‌కు విన్నవించారు. త్వరలోనే అధికారుల బృందం గూడెంలో పర్యటిస్తుందని చెప్పారు. తాను ఈ గూడేన్ని దత్తత తీసుకున్నానని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కెసీ కెనాల్ చైర్మన్ రామలింగారెడ్డి, తెలుగుగంగ ప్రాజెక్టు వైస్ చైర్మన్ కంచర్ల మనోహర్‌చౌదరి, సీనియర్ నాయకుడు సురేష్‌రెడ్డి, మోహన్‌రావు, చంద్రపాల్, విజయ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 18 , 2025 | 11:21 PM