ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం

ABN, Publish Date - May 18 , 2025 | 11:42 PM

పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తున్న మంత్రి భరత్‌, సోమిశెట్టి

సి.క్యాంపు రైతు బజార్‌ అభివృద్ధికి రూ.6కోట్లు

కార్పొరేషన్‌ ఎన్నికల్లో 33 వార్డులు గెలవాలి

బీసీ భవన్‌ నిర్మాణానికి రూ.కోటి

‘కర్నూలు మహానాడు’లో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, మే 18(ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ఆదివారం నగరంలోని ఆయన కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ‘కుడా’ చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌, కార్పొరేషన్ల డైరెక్టర్లు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ప్రాణాలర్పించిన జవాన్లకు సంతాపం తెలిపారు. అనంతరం కార్పొరేషన్ల డైరెక్టర్లు, కార్పొరేటర్లు, సీనియర్‌ నాయకులు మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ సీఎం కర్నూలు పర్యటనలో సి.క్యాంపులో రైతు బజారును అభివృద్ధి చేసేందుకు చంద్రబాబునాయుడు రూ. 6 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఓర్వకల్లు పారిశ్రామికవాడలో ఎన్నో పరిశ్రమలు రానున్నాయని, పాలనాపరమైన విధానాల కారణంగా ఒక్కొక్క అడుగు ముందు పడుతుందన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి సూచిం చారు. తనకు ఒక విజన్‌ ఉందని ఆ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక చేపడతానని, నగరంలోని 33వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలవాల్సిందేనన్నారు. కూటమి ప్రభుత్వం దశాబ్దకాలం పాటు అధికారంలో ఉండాలన్నారు. తెలుగేదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ కావడంతో ఆ వర్గానికి సంబంధించి 22వ వార్డులో బీసీ భవన్‌ నిర్మాణానికి తన వంతు రూ.కోటి సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పధకాలను ఎప్పటికప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషియల్‌ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ల డైరెక్టర్లు కోంకతి లక్ష్మీనారాయణ, సంజీవ లక్ష్మి, జేమ్స్‌, పోతురాజు రవీకుమార్‌, కార్పొరేటర్లు పరమేష్‌, జకియాఅక్సారీ, సుజాత, నీలో ఫర్‌, విజయకుమారి, సోమిశెట్టి నవీన్‌, అబ్బాస్‌, హమీద్‌, మాజీ కార్పొరేటర్లు, వార్డు , క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 11:42 PM