విభేదాలకు చెక్ పెడతాం
ABN, Publish Date - Jul 14 , 2025 | 11:45 PM
టీడీపీ ఆలూరు నియోజకవర్గంలో నెలకొన్న వర్గ విభేదాలకు చెక్ పెడతామని ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు అన్నారు.
పార్టీ నాయకులను ఒక తాటిపైకి తెస్తాం
ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు
ఆలూరు, జూలై14(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఆలూరు నియోజకవర్గంలో నెలకొన్న వర్గ విభేదాలకు చెక్ పెడతామని ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు అన్నారు. సోమవారం ఆలూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆలూరు మండల బూత్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో బస్తిపాటి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీలో విభేదాలకు అవకాశం ఇవ్వకుండా సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. పూల నాగరాజు మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బుజ్జమ్మ, టీడీపీ మండల కన్వీనర్ అశోక్, జెడ్పీటీసీ లింగప్ప, నాయకులు రామ్‌నాథ్‌యాదవ్, శేషగిరి, మండల బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు.
Updated Date - Jul 14 , 2025 | 11:45 PM