ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సొంత పిల్లల్లా చూసుకోవాలి : కలెక్టర్‌

ABN, Publish Date - May 28 , 2025 | 12:13 AM

శిశు గృహ కేంద్రంలో ఉన్న చిన్నారులను సొంత పిల్లల్లా ప్రేమతో చూసుకోవాలని కలెక్టర్‌ పి.రంజితబాషా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.

శిశుగృహంలో రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రంజిత బాషా

కర్నూలు హాస్పిటల్‌, మే 27(ఆంధ్రజ్యోతి): శిశు గృహ కేంద్రంలో ఉన్న చిన్నారులను సొంత పిల్లల్లా ప్రేమతో చూసుకోవాలని కలెక్టర్‌ పి.రంజితబాషా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. మంగ ళవారం నగరంలోని సి.క్యాంపులో ఉన్న శిశు గృహ కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎంత మంది చిన్నారులు శిశు గృహాల్లో ఉన్నారని, ప్రతి రోజు పిల్లలను డాక్టర్‌ పరిశీలిస్తున్నారా అని కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. శిశు కేంద్రం ప్రారంభం అయినప్పటి నుంచి ఎంత మంది పిల్లలు ఉన్నారని, ఇప్పటి వరకు ఎంత మందిని దత్తత ఇచ్చారని ప్రశ్నించారు. శిశుగృహ కేంద్రం ఇనచార్జి మెహతాజ్‌ బేగం స్పందిస్తూ 2006లో శిశు గృహ ప్రారంభించామని, ఇప్పటి వరకు 132 మంది దత్తత ఇచ్చామని, అందులో ఇతర దేశాలకు 17 మందిని దత్తత ఇచ్చామన్నారు. అనంతరం కలెక్టర్‌ లివింగ్‌ రూం, కిచెన, బాత్రూమ్‌లను కలెక్టర్‌ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శివు గృహ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న పిల్లలను దత్తత ఇవ్వడానికి ఆనలైన పోర్టల్‌లో వారి డేటాను నమోదు చేశారా అని కలెక్టర్‌ ప్రశ్నించారు. దత్తత ఇచ్చిన తర్వాత పిల్లలు ఏవిధంగా ఉన్నారని ఫాలో ఆప్‌ చేస్తూన్నారా అని ఐసీడీఎస్‌ పీడీ పి.నిర్మలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా బాలల సరక్షణ అధికారి శారద, శిశు గృహ కేంద్రం ఇనచార్జి మేనేజర్‌ మెహతాజ్‌ బేగం ఉన్నారు.

Updated Date - May 28 , 2025 | 12:13 AM