ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం చంద్రబాబును చూసి ఎంతో నేర్చుకోవాలి

ABN, Publish Date - Apr 21 , 2025 | 12:28 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

అక్షయ బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం చేస్తున్న మంత్రి టీజీ భరత్‌, ఎంపీ నాగరాజు

జన్మదిన వేడుకల్లో పరిశ్రమల శాఖ మంత్రి

రక్తదానం చేసిన టీజీ భరత్‌, ఎంపీ నాగరాజు

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని గౌరిగోపాల్‌ హాస్పిటల్‌ సమీపంలో ఉన్న అక్షయ బ్లడ్‌ బ్యాంకులో మంత్రి రక్తదానం చేశారు. అంతకు ముందు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేక్‌ను కట్‌చేశారు. మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం సీఎం చంద్రబాబు బ్రాండ్‌తోనే రాష్ట్రానికి వచ్చాయన్నారు. మంత్రితో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పలువురు నాయకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టూరిజం కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ముంతాజ్‌, కార్పొరేటర్లు కైపా పద్మలతరెడ్డి, కురువ పరమేష్‌, గౌరిగోపాల్‌ హాస్పిటల్‌ ఈడీ డా.శ్రీకాంత్‌ రెడ్డి, అక్షయ బ్లడ్‌ బ్యాంక్‌ డైరెక్టర్లు డా.శ్రీకాంత్‌ రెడ్డి, డా.అనంత, డా.గంగాధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 12:28 AM