భావి తరాలకు పర్యావరణాన్ని కాపాడాలి
ABN, Publish Date - Jun 05 , 2025 | 11:19 PM
పర్యావరణాన్ని కాపాడి భావి తరాలకు అందించాలని రాష్ట్ర మైనార్టీ, న్యాయ, సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
రాష్ట్ర న్యాయ, మైనార్టీ, సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల టౌన్, జూన్5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణాన్ని కాపాడి భావి తరాలకు అందించాలని రాష్ట్ర మైనార్టీ, న్యాయ, సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్జీవో కాలనీలోని పురపాలక పాఠశాలలో అటవీశాఖ, పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు కలెక్టర్ రాజాకుమారి, జేసీ విష్ణుచరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలను నాటి వాటి బాధ్యతగా తీసుకోవాలని కోరారు. నేటి కాలంలో పర్యావరణానికి హాని కలిగించే ప్లాసిక్ వాడకాన్ని తగ్గించాలని అన్నారు. అనంతరం ప్లాస్టిక్ రహిత బాటిళ్లను పంపిణీ చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఆ తర్వాత కలెక్టర్ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. పర్యావరణాన్ని కాపాడుకుందాం.. అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, జిల్లా డివిజన్ అధికారులు, పురపాలక ఇన్‌చార్జి కమిషనర్ వెంకటదాస్ డీఈవో జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 11:19 PM