ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌ తప్పిదాలను సరిచేస్తున్నాం

ABN, Publish Date - Jun 12 , 2025 | 12:19 AM

గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ చేసిన తప్పిదాలు సరిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

కుంగిన రాతి పరుపును పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల

రూ. 58 కోట్లతో గోరుకల్లు రిజర్వాయర్‌ మరమ్మతులకు ప్రతిపాదనలు

మంత్రి నిమ్మల రామానాయుడు

పాణ్యం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ చేసిన తప్పిదాలు సరిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాణ్యం మండలంలోని గోరుకల్లు రిజర్వాయర్‌ను (నరసింహరాయ సాగర్‌) బుధవా రం ఈయన పరిశీలించారు. రిజర్వాయర్‌లో కుంగిన రాతి పరుపును పరి శీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్‌ ఐదేళ్ల విధ్వంస పాలనలో పోలవరం నుంచి గోరుకల్లు వరకు నీటి ప్రాజెక్టులన్నీ ఽనిర్లక్షానికి గురయ్యాయన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌కు ఒక్కరూపాయి కేటాయించ లేదని అన్నారు. రిజర్వాయర్‌ బ్యాలెన్స్‌ పనులు పూర్తి చేయకపోవడంతోనే మరింత ఆర్థిక భారం ప్రభుత్వంపై పడిందన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌ నిండితేనే రాయలసీమలోని మిగతా రిజర్వాయర్లు నిండుతాయని అన్నారు. ఈ రిజర్వాయర్‌ మర మ్మతులకు రూ. 58 కోట్ల అంచనాలతో ఆర్ధిక శాఖకు ప్రతిపా దనలు పంపినట్లు తెలిపారు. శ్రీఽశైలం ప్లంజ్‌ పూల్‌ మరమ్మతుల కోసం రూ. 30 కోట్లు కేటాయించి మరమ్మతులు చేపడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం తప్పిదాలు సరిచేయ డానికే సరిపోయిందన్నారు. రెవెన్యూ, మైనింగ్‌, వ్యవసాయ తదితర రంగాలు పూర్తి అస్తవ్యస్తమయ్యాయ న్నారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, తహసీల్దారు నరేంద్రనాథ్‌ రెడ్డి, ఎస్‌ఐలు నరేంద్ర కుమార్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:19 AM