ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చివరి ఆయకట్టు వరకు నీళ్లు

ABN, Publish Date - Jul 12 , 2025 | 11:51 PM

ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌, తెలుగుగంగ వంటి ప్రధాన కాలువలతో పాటు జిల్లాలోని అన్ని కాలవలకు శనివారం అర్ధరాత్రి నుంచే నీటిని విడుదల చేస్తామని, ఖరీఫ్‌కు సంబంధించి ఈ ఏడాది ప్రతి చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.

సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌

ఖరీఫ్‌లో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు

ఐఏబీ సమావేశంలో ప్రజాప్రతినిధులు

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌, తెలుగుగంగ వంటి ప్రధాన కాలువలతో పాటు జిల్లాలోని అన్ని కాలవలకు శనివారం అర్ధరాత్రి నుంచే నీటిని విడుదల చేస్తామని, ఖరీఫ్‌కు సంబంధించి ఈ ఏడాది ప్రతి చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో కలెక్టర్‌ రాజకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఐఏబీ సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, రోడ్లు, భవనాలు మౌలిక సదుపాయలు, పెట్టుబడులశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యేలు గౌరుచరితా రెడ్డి, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖరరెడ్డి, గిత్తా జయసూర్య హాజరయ్యారు. మంత్రులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారం అర్ధరాత్రి నుంచి అన్ని ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేస్తామన్నారు. సాగునీటికి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని, నీటిని వృథా చేయవద్దని రైతులకు సూచించారు. జిల్లాలో ప్రతి రైతు వరి సాగు చేయడంతో సమస్యలు వస్తున్నాయని, సీజన్‌ పంటలపై దృషి సారించాలని సూచించారు. 15ఏళ్ల చరిత్రలో లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌ పంటలకు 20 రోజులు ముందుగానే నీటిని విడుదల చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ నీటిపారుదలశాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆళ్లగడ్డలో కేసీ కెనాల్‌ కాల్వలను మీద వెంచర్‌ వేసిన వారిపై ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో లస్కర్ల సిబ్బంది కొరత వల్ల రైతులకు సక్రమంగా నీళ్లు చేరడం లేదని, వెంటనే లస్కర్‌ల పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

పులివెందులకు నీళ్లు తీసుకెళ్లిన ఘనత సీఎం చంద్రబాబుదే: మంత్రి బీసీ

గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో ప్రారంభిస్తే గతంలో టీడీపీ ప్రభుత్వం రూ.300 కోట్ల నిధులు ఖర్చు చేయడంతో నేడు ఆ రిజర్వాయర్‌ ద్వారా కడప, నంద్యాల జిల్లాల్లో సుమారు రెండు లక్షల ఆయకట్టుకు నీరు అందిస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులతోనే అవుకు రిజర్వాయర్‌కు కూడా నీళ్లు తెచ్చామన్నారు. పులివెందులకు కూడా గాలేరు, నగరి సుజలస్రవంతి ప్రాజెక్టులో దశాబ్ద కాలంగా కాలువలు తవ్వి వదిలిపెడితే, సమస్యలన్నింటినీ అధిగమించి అవుకు ప్రాజెక్టుకు నీళ్లు నింపిన ఘతన టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. గత ప్రభుత్వం అలగనూరు ప్రాజెక్టుకు కనీసం రూ.3కోట్లు ఖర్చు చేయకుండా వదిలేశారని చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయల సీమకు తీసుకరావడానికి ప్రయత్నిస్తుంటే రాజకీ యం కోసం విమర్శలు చేస్తున్నారని దుయ్య బట్టారు. తెలంగాణ రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలపై వైసీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. త్వరలో బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రమంత్రిని కలిసి ప్రాజెక్టు ఆవశ్యకతను తెలియజే స్తామన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌ కట్టలు ఎప్పటికప్పుడు తెగుతున్న క్రమంలో శాస్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల మంతా గుండ్రేవుల ప్రాజెక్టు కోసం తీర్మానం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఐఈబీ సమావేశంలో తీర్మానాలివీ..

కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్‌ ప్రకా రం కేటాయించిన 31.90 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు తగిన జలాశయం లేకపోవడంతో 2019లో శంకుస్థాపన చేసిన గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రతిపాదించారు.

తెలుగుగంగ పథకం, కేసీ కాలువ కింద రైతాంగం సాగునీటి అవసరాల దృష్ట్యా 2026 జనవరి 31 వరకు 12 టీఎంసీల నీటిని వెలుగోడు జలాశయంలో నిల్వ చేయాలని తీర్మానించారు.

అలగనూరు జలాశయ మరమ్మతులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని, రాబోయే బడ్జెట్‌లో నిధుల ను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

కేసీ కాలువకు 13వ తేదీ నుంచి, తెలుగుగంగ కాలువకు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి, ఎస్సార్బీసీ కాలువకు 12వతేదీ అర్ధరాత్రి నుంచి, హంద్రీ నీవా కాలువకు 15వ తేదీ నుంచి నీటిని విడుదల చేయాలని తీర్మానించారు.

Updated Date - Jul 12 , 2025 | 11:51 PM