ఒక్క గేటు ద్వారా నీరు విడుదల
ABN, Publish Date - Jul 13 , 2025 | 12:00 AM
శ్రీశైలం జలాశయంలో శనివారం ఉదయం రెండు గేట్లను మూసివేసి ఒక్క గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో శనివారం ఉదయం రెండు గేట్లను మూసివేసి ఒక్క గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 27,157 క్యూసెక్కులు, కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 68,377 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 1,39,297 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుం టోంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయ నీటిమట్టం 883 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టును వీక్షించేందుకు తరలివచ్చిన సందర్శకులతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో ఆ దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు.
Updated Date - Jul 13 , 2025 | 12:00 AM