ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలానికి పెరిగిన నీటి మట్టం

ABN, Publish Date - Jun 19 , 2025 | 11:16 PM

నీలం సంజీవరెడ్డి సాగర్‌ ప్రాజెక్ట్‌ (శ్రీశైలం రిజర్వాయర్‌)లో నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది.

జలాశయంలోకి చేరిన నీరు

నంద్యాల (శ్రీశైలం), జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): నీలం సంజీవరెడ్డి సాగర్‌ ప్రాజెక్ట్‌ (శ్రీశైలం రిజర్వాయర్‌)లో నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి వరద పోటెత్తుతోంది. దీంతో ప్రతి రోజు 30 వేల క్యూసెక్కులకుపైగానే శ్రీశైలం జలాశయంలోకి వరద వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రానికి 42,205 క్యూసెక్కుల మేర వరద జలాశయంలోకి వచ్చి చేరింది. అదేవిధంగా రెండు పవర్‌ హౌస్‌ల్లోని విద్యుత్‌ ఉత్పాదన తాత్కాలికంగా నిలిపివేశారు. డ్యాంలో 73.9870 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. డ్యాం నీటి మట్టం 847.10 అడుగులకు చేరుకుంది.

Updated Date - Jun 19 , 2025 | 11:16 PM