వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు మేలు: బీజేపీ
ABN, Publish Date - Apr 22 , 2025 | 12:53 AM
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుతో ముస్లింలకు మేలు జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వినూషా రెడ్డి అన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుతో ముస్లింలకు మేలు జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వినూషా రెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొంత మంది పెత్తందారుల చేతుల్లో వక్ఫ్‌బోర్డు ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు. వక్ఫ్ భూములపై ఎవరు పర్యవేక్షణ చేస్తున్నారో తెలియడం లేదన్నారు. అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీలో భక్తులు విరాళాలు వేస్తారని, వీటికి టీటీడీ ప్రభుత్వానికి, ప్రజలకు సమాధానం చెబుతుంద న్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలోని ఆస్తులు పక్కదారి పట్టాయన్నారు. 1954 సంవత్సరంలో వక్ఫ్‌బోర్డు ఏర్పాటైందని, 31వేల లక్షల భూములు ఉన్నాయని లెక్కలో పేర్కొన్నారు. ఆ నిధులతో ఆసుప త్రులు కట్టించలేదని, పేద ముస్లిం మహిళలకు ఆర్థిక సాయం కానీ, పిల్లలకు విద్య చూపించలేదని తెలిపారు. కర్ణాటక, బెంగళూరులోని వక్ఫ్‌భూములు అన్యాక్రాంతమయ్యాని అన్నారు. రూ.500 కోట్లు విలువ చేసే ఆస్తులకు కేవలం రూ.50వేలు అద్దె చెల్లిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీఎస్ నాగరాజు, ముస్లిం మోర్చా మైనార్టీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Apr 22 , 2025 | 12:53 AM