పల్లె పాలవెల్లి
ABN, Publish Date - Jun 02 , 2025 | 11:58 PM
మనిషి తీసుకునే ఆహారంలో పాలు ప్రధానం. ఆహారపరం గానే కాకుండా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పాల ప్రత్యేకత గురించి ప్రజల్లో చైతన్యం కల్గించ డానికి ప్రతి ఏడాది ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు
4,14,395 ఆవులు, గేదెలు
పాడి పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు
నంద్యాల ఎడ్యుకేషన్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): మనిషి తీసుకునే ఆహారంలో పాలు ప్రధానం. ఆహారపరం గానే కాకుండా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పాల ప్రత్యేకత గురించి ప్రజల్లో చైతన్యం కల్గించ డానికి ప్రతి ఏడాది ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మన దేశంలో అత్యధికంగా టీ, కాఫీ తాగనిదే రోజు గడవదు. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మన జిల్లాలో వ్యవసా యం తర్వాత ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్న రంగాల్లో పాడిపరిశ్రమ ఒకటి. వ్యవసాయ రంగానికి తోడుగా పాడిపరిశ్రమ గ్రామీణ జీవితంలో, ఆర్థిక వ్యవస్థలో ప్రధానం. రైతులు పాల ఉత్పత్తితో స్వయం సమృద్ధి చెందారు. మధ్యవర్తులపై ఆధారపడకుండా ప్రత్యక్షంగా మార్కెట్‌కు పాలు విక్రయించే అవకాశాలు పెరిగాయి.
నంద్యాల జిల్లాలో 1.2 లక్షల అవులు, 2.94 లక్షల గేదెలు ఉన్నాయి. అందులో పునరుత్పత్తి సామర్ధ్యం కల్గిన ఆవులు 72 వేలు, గేదెలు 1.74 లక్షలు ఉండగా మొత్తం 2.48 లక్షలు గేదెలు, అవులు ఉన్నా యి. అలాగే మిల్క్ యాని మల్స్ 43వేల ఆవులు, 1.04 లక్షల గేదెలు ఉన్నా యి. మొత్తం 4,14,395 ఆవులు, గేదెలు ఉన్నా యి. ప్రతిరోజు సగటున ఇండియన్ స్టాండర్స్ ప్రకారం ప్రతి మనిషి 500 గ్రాముల పాలు తీసు కుంటున్నారు. దీని ప్రకారం మన జిల్లాలో 10 లక్షల లీటర్ల పాలు అవసరం. కానీ మన జిల్లాలో అంతకు మించి 1.53 లక్షల లీటర్ల పాలు అదనంగా ఉత్పత్తి జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టాండర్స్ ప్రకారం ప్రతి మనిషి 800 గ్రాములు తీసుకుంటు న్నారని గణాంకాలు చెబుతు న్నాయి. ఈ ప్రకారం జిల్లాకు 16 లక్షల లీటర్ల పాలు అవసరం. అంటే 4.47 లక్షల లీటర్ల లోటు ఉంది. దీంతో పాల ఉత్పత్తిని ప్రభుత్వం మరింత పెంచేందుకు పాడి రైతులకు అండగా ఇటీవలే పలు చర్యలు తీసుకున్నారు.
అధిక పాలు ఇచ్చే జాతులు
ఆవులు - హెచ్‌ఎఫ్, జెర్సీ, సాహివాల్
గేదెలు - ముర్రా, జఫ్రాబాది, మెహసానా
ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవీ..
వైసీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమపై చూపిన నిర్లక్ష్యం కారణంగా పాల దిగుబడి తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పశువులకు ప్రధానంగా షెడ్లను నిర్మించేందుకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం ద్వారా 90శాతం సబ్సిడీతో రైతులను ప్రోత్సహిస్తూ మినీ గోకులాల నిర్మాణాలను చేపట్టింది. జిల్లాలో రికార్డు స్థాయిలో 854 మంజూరు కాగా 750 షెడ్‌లకు పైగా పూర్తయ్యాయి. జిల్లాలో రూ.12 లక్షల సబ్సిడీతో మూడేళ్ల వరకు వర్తించేలా పశువులకు బీమా సౌకర్యాన్ని కల్పించారు. అలాగే వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా పశునీటితొట్టిలు ఏర్పాటు చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద పశువులకు పచ్చిగడ్డి ఎల్లప్పుడు లభించే విధంగా 10సెంట్ల నుంచి 50సెంట్ల వరకు పాడిరైతులు పచ్చిగడ్డి సాగు చేసుకునేలా ప్రోత్సహిస్తూ 90శాతం ప్రభుత్వ వాటాగా నిధులను మంజూరు చేసింది. అలాగే ప్రస్తుతం పశువులకు జిల్లాకు 200 మెట్రిక్ టన్నుల పశుదాణా కూడా రైతులకు పంపిణీ చేస్తున్నారు.
రోజూ 60 లీటర్ల పాలు ఇస్తున్నాయి
నాకు 10 పాడిగేదెలు ఉన్నాయి. ప్రతిరోజు 60 నుంచి 70 లీటర్ల పాలు ఇస్తున్నాయి. వట్టిగడ్డితో పాటు ప్రతిరోజు పచ్చిగడ్డి వేయడంతో పాటు, పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యం. షెడ్డులో ఎప్పుడూ గాలి, వెలుతురు ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా పశువైద్యులను సంప్రదిస్తు న్నాం. మరింత దిగుబడి సాధించడానికి ప్రయత్నిస్తున్నాం. - గురునాథరెడ్డి, బూజునూరు, గడివేముల మండలం
మంచి ఉత్పాదకత ఉండే జాతి పశువులను పెంచాలి
పాల ఉత్పత్తి పెరగాలంటే మెరుగైన లక్షణాలతో ఉన్న జాతి పశువులను పెంచు కోవాలి. గేదెలు, ఆవులు ప్రతి మూడు లీటర్ల పాలు ఇచ్చిన ప్పుడు వాటికి కేజీ దాణా ఇవ్వాలి. ప్రతిరోజు ఎండుగడ్డితో పాటు 20నుంచి40 కేజీల పచ్చిగడ్డి ఇవ్వాలి. పశువులకు దాణా ఎంత అవసరమో వాటికి నీడ కూడా అంతే అవసరం. రెగ్యులర్‌గా వ్యాక్సినేషన్, డీ వార్మింగ్ చేయించాలి. మంచినీరు తాపాలి. పశువైద్యులను సంప్రదిస్తూ ఉండాలి. - డాక్టర్ గోవింద్‌నాయక్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, నంద్యాల
Updated Date - Jun 02 , 2025 | 11:58 PM