ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా వేంకటేశ్వరస్వామి రథోత్సవం

ABN, Publish Date - May 10 , 2025 | 12:38 AM

మండలంలోని కొమరోలు గ్రామం లో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం తెల్ల వారుజామున స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది.

రథాన్ని లాగుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు, మే 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొమరోలు గ్రామం లో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం తెల్ల వారుజామున స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు రామాంజనేయులు శర్మ స్వామివారికి సుప్రభాత సేవ, అభి షేకాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గౌరు చరి తారెడ్డి హాజరయ్యారు. అంతకుముందు వేంకటేశ్వరస్వామికి ఆమె కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రథాన్ని ఎమ్మెల్యే పూజలు చేసి ముందుకు కదిలించారు. చెక్కభజనలు పలు వురిని ఆకట్టుకున్నాయి. భక్తులు రథాన్ని ఊరువాకిలి వరకు లాగి యథాస్థానంలో నిలిపారు. కార్యక్రమంలో సర్పంచ రామచంద్రుడు, మాజీ కాల్వబుగ్గ చైర్మన చంద్రపెద్ద స్వామి, నాయకులు భాస్కర్‌రెడ్డి, ఆకుల మహేష్‌, కాకి దేవేంద్ర, రామమద్దిలేటి, నాగమల్లేష్‌, సంజీవ, ప్రతాప్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:38 AM