విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:31 AM
ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర పునరుత్పా దక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఓర్వకల్లు మం డలంలోని పిన్నాపురం గ్రీన కో ప్రాజెక్టును సందర్శించేం దుకు గురువారం విచ్చేశారు.
ఓర్వకల్లు/ కర్నూలు క్రైం, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర పునరుత్పా దక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఓర్వకల్లు మం డలంలోని పిన్నాపురం గ్రీన కో ప్రాజెక్టును సందర్శించేం దుకు గురువారం విచ్చేశారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో ఆయనకు కర్నూలు, నంద్యాల పార్లమెంటు సభ్యులు బస్తి పాటి నాగరాజు, భైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ, ఎస్పీ విక్రాంత పాటిల్, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. కర్నూలు నగరం లోని మౌర్యఇన హోటల్ చేరుకున్న కేంద్ర మంత్రి పహ్లాద్ జోషిని మర్యాద పూర్వకంగా కలిసి జాయింట్ కలెక్టర్ బి.నవ్య పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విద్యాసాగర్, ఎస్‌ఐ సునీల్ కుమార్ ఉన్నారు.
Updated Date - Apr 18 , 2025 | 12:31 AM