ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫిట్‌నెస్‌ లేని బస్సులను సీజ్‌ చేయాలి

ABN, Publish Date - Jun 24 , 2025 | 12:34 AM

జిల్లా వ్యాప్తంగా ఫిట్‌నెస్‌ లేని విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేసి సీజ్‌ చేయాలని రిపబ్లికన స్టూడెంట్‌ ఫెడరేషన (ఆర్‌ఎస్‌ఎఫ్‌) జిల్లా కార్యదర్శి మహేష్‌ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇనచార్జి డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు.

ఇనచార్జి డీఆర్వోకు వినతి పత్రం ఇస్తున్న ఆర్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి మహేష్‌

ఇనచార్జి డీఆర్వోకు ఆర్‌ఎస్‌ఎఫ్‌ నాయకుల వినతి

కర్నూలు కలెక్టరేట్‌, జూన 23(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఫిట్‌నెస్‌ లేని విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేసి సీజ్‌ చేయాలని రిపబ్లికన స్టూడెంట్‌ ఫెడరేషన (ఆర్‌ఎస్‌ఎఫ్‌) జిల్లా కార్యదర్శి మహేష్‌ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇనచార్జి డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. మహేష్‌ మాట్లాడుతూ బస్సు ల ఫీజుల పేరుతో వేలాది రూపాయలను ప్రైవేటు, కార్పొరేట్‌ యాజ మాన్యాలు విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వసూళ్లు చేస్తున్నారని ఆరోపిం చారు. జిల్లా వ్యాప్తంగా ఫిట్‌నెస్‌ లేని బస్సులను నడుపుతూ విద్యార్థుల భద్రతను గాలికి వదిలేసారన్నారు. విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేయాలని కోరారు. కార్యక్రమంలో మధు, కార్తీక్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలి: జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని కోరుతూ యునైటెడ్‌ జర్నలిస్టు ఫోరం నాయకులు ఇనచార్జి డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియా రంగంలో పని చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు. వ్యవస్థాపక కార్యదర్శి చిన్న రామాంజనేయులు జిల్లా అధ్యక్షులు డి.విద్యాసాగర్‌, జిల్లా కార్యదర్శి డి.చంద్రమోహన, యూసుఫ్‌ఖాన, విజయకుమార్‌, మధు, కరణ్‌, లక్ష్మన్న, విజయకుమార్‌ పాల్గొన్నారు.

వెల్దుర్తి గ్రామ పంచాయతీలో లక్షలు స్వాహా: వెల్దుర్తి గ్రామ పంచాయతీలో పని చేయని సిబ్బంది పేరిట లక్షలు స్వాహా చేశారని వెల్దుర్తి చెందిన చిన్నా జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్యకు వినతి పత్రం అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మేజర్‌ గ్రామ పంచాయతీలో 51 మంది కార్మికులు పని చేస్తున్నారని అన్నారు. వీరిలో 40 మంది సిబ్బందిని టెండరు ద్వారా విధుల్లోకి తీసుకుని 28 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నట్లు హాజరు రికార్డులలో చూపిస్తూ 23 మంది కార్మికులతో మాత్రమే పని చేస్తున్నారు. అయితే పని చేయని ఐదుగురు పేర్లపై కూడా హాజరు వేస్తూ, ఏజెన్సీ అకౌంటుకి వారికి కూడా జీతాలు వేసినట్లు రికార్డులు ఉన్నాయి. అలాగే స్వచ్ఛభారత కార్మికులు హాజరు రికార్డులో 11 మంది పని చేస్తున్నట్లు నమోదు కాగా, జీతాలు వేసే రికార్డులో మాత్రం 12 మందిని చూపిస్తున్నాయి. సుమారు 6 మంది ఎలాంటి పని చేయకుండానే పారిశుధ్య కార్మికులు ఐదు మంది నెలకు రూ.9వేలుగానూ స్వచ్ఛభారత ద్వారా ఒకరు రూ.6వేలు మాదిరిగా మొత్తం నెలకు రూ.51వేల చొప్పున దాదాపు రూ.20లక్షలు పైగానే అవినీతి సొమ్ము స్వాహా చేశారనీ ఆరోపించారు.

Updated Date - Jun 24 , 2025 | 12:34 AM