ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మట్టి మిద్దె కూలి..

ABN, Publish Date - May 07 , 2025 | 12:31 AM

మట్టి మిద్దెను పెకిలిస్తుండగా పైకప్పు కూలి ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు దుర్మరణం చెందారు.

ఉయ్యాలవాడ మండలం ఆర్‌.పాంపల్లెలో కూలిన మట్టి మిద్దె, ఇన్‌సెట్‌లో మృతుల ఫైల్‌ ఫొటోలు

ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు దుర్మరణం

మరో ఇద్దరికి గాయాలు

ఉయ్యాలవాడ, మే 6 (ఆంధ్రజ్యోతి): మట్టి మిద్దెను పెకిలిస్తుండగా పైకప్పు కూలి ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఉయ్యాలవాడ మండలం ఆర్‌.పాంపల్లె గ్రామంలో చోటుచేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆర్‌.పాంపల్లెకు చెందిన గంప తిరుపాలు మట్టి మిద్దెకు మరమ్మతులు చేయిస్తున్నాడు. మిద్దె పైకప్పు కూలి అదే గ్రామానికి చెందిన పొగాకు నారాయణ(40), ఆళ్లగడ్డ మండ లం ఎస్‌.లింగందిన్నెకి చెందిన బండి యోనా(45) అక్కడిక్కడే మృతి చెం దారు. మట్టి మిద్దెకు మరమ్మతులు చేయటానికి ఆళ్లగడ్డ, ఎస్‌.లిగందిన్నె గ్రామాలకు చెందిన ఏడుగురు రూ.11వేలకు గుత్తకు ఒప్పుకొని శనివారం ఉదయం పనులు ప్రారంభించారు. మిద్దెకింద ఉన్న బండలను మంగళ వారం తొలగిస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కూలి నారాయణ, యోనాలు, కుమార్‌, బాబులపై పడింది. నారాయణ, యోనాలు మట్టి కింద కూరుకు పోగా కుమార్‌, బాబులు గాయాలతో బయట పడ్డారు. మిగిలిన ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. మట్టిలో కూరకుపోయిన వారిని వెలికి తీసి ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు.

అనాథలైన కుటుంబీకులు

ఇంటి పెద్దలను కోల్పోవటంతో ఇరు కుటుంబాలుకు చెందిన వారు అనాథలుగా మిగిలారు. అనాధలుగా మిగిలారు. వారు ప్రతి రోజూ కూలీ పనికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి వారిది. కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారు చేస్తున్న అర్తనాదాలు పలువురిని కంట తడిపెట్టిం చాయి. మృతుడు నారాయణకు ఐదేళ్ల క్రితం మొదటి భార్య చనిపో వటంతో మూడేళ్ల క్రితం అనంతపురం జిల్లాకు చెందిన లలితను వివిహం చేసుకున్నాడు. వీరికి 30రోజుల వయస్సున్న కుమార్తె ఉంది. మొదటి భార్య సంతానం ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు యోనాకు నలుగురు కుమార్తెలు, భార్య లీలావతి ఉన్నారు. పెద్దకుమార్తె ఆరుణకు రెండేళ్ల క్రితం వివామమైంది. రెండో కుమార్తె స్వప్న దివ్యాంగురాలు, మూడవ కుమార్తె రాణి ఇంటర్‌ పూర్తిచేసి ఇంటి వద్దే ఉండి తల్లి దండ్రులకు సహయపడుతోంది. నాల్గవ కుమార్తె బేబి ఇంటిర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పూర్తి చేసింది. ఈ ఘటనపై ఉయ్యాలవాడ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.

కౌతాళం, మే 6(ఆంధ్రజ్యోతి): వారిద్దరు స్నేహితులు.. కలిసి కూలీ పనులకు వెళ్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మంగళ వారం కూలీ పనులకు వెళ్లారు. విద్యు దాఘాతానికి గురై మృత్యువులోనూ స్నేహ బంధాన్ని వీడకుండా ఇరు వురు అనంత లోకాలను చేరని హృదయ విదారక ఘటన మండ లంలోని ఉరుకుంద గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఉరుకుంద గ్రామంలోని దళితకాలనీకి చెందిన కట్టమీద సునీల్‌ అలియాస్‌ నాని(24), అదేకాలనీకి చెందిన మహేంద్ర(23) స్నేహితులు. ప్రతిరోజు ఇద్దరు కలిసి కూలీ పనులకు వెళ్ళి కుటుంబాలను పోషించేవారు. రోజువారీ కూలీలో భాగంగా మంగళవారం ఉదయం గ్రామంలోని ఓ సంఘం కల్యాణ మంటపంలో జరుగు వివాహ కార్యక్రమానికి టెంట్‌ వర్క్‌ కోసం పనులకు వెళ్లారు. టెంట్‌ వేస్తున్న సమయంలో పక్కన ఉన్న విద్యుత్‌ తీగలను గుర్తించలేదు. ఇనుప కడ్డీలు విద్యుత్‌ తీగలకు తగిలాయి. చేతుల్లో ఉన్న కడ్డీలకు విద్యుత్‌ సరఫరా అయ్యింది. వారిద్దరూ ఒకేసారి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యరు. కుటుంబ పెద్ద అకాల మృతితో తమకు దిక్కెవరని సునీల్‌ భార్య వినిత రోదిస్తున్న తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. సునీల్‌కు భార్యతో పాటు రెండేళ్ల కుమార్తె, ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. మృతుల కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌతాళం సీఐ అశోక్‌కుమార్‌ కేసు చేసి మృత దేహాలను ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - May 07 , 2025 | 12:31 AM