ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ నేతల్లో వణుకు

ABN, Publish Date - May 30 , 2025 | 11:35 PM

కడప మహానాడుకు అంచనాకు మించి విజయవంతం కావడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

వైసీపీలో జైలు, బెయిల్‌ భయం

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు అర్బన్‌, మే 30(ఆంధ్రజ్యోతి): కడప మహానాడుకు అంచనాకు మించి విజయవంతం కావడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుడా చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన తప్పులకు నేడు వారిలో జైలు, బెయిల్‌ భయం పట్టుకుందన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో రైతుల, సామాన్యులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారిని వైసీపీ నాయకులు వేధించారన్నారు. రైతుల సొంత భూములనూ కాజేసేందుకు వైసీపీ కుట్రలు చేసిందన్నారు. ఎన్నికలకు ముందు తమ అధినాయకత్వం ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హమీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. త్వరలోనే ‘తల్లికి వందనం’ అమలు చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు సైతం ఇస్తున్నామని తెలిపారు. కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ లక్షలాది మంది టీడీపీ శ్రేణులతో మహానాడు విజయవంతమైం దన్నారు. రెడ్‌ బుక్‌ అంటే వైసీపీ నాయకులు భయపడుతున్నారని, తప్పుచేసిన వారికే రెడ్‌ బుక్‌ వర్తిస్తుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌, శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నంద్యాల నాగేంద్ర, వి. హనుమంతరావు చౌదరి, కుమ్మరి శాలివాహన జిల్లా అధ్యక్షుడు సుగురు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:35 PM