ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పారదర్శకంగా బదిలీలు

ABN, Publish Date - Jun 11 , 2025 | 12:00 AM

జిల్లాలో పోలీసుల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టినట్లు ఎస్పీ అదిరాజ్‌సింగ్‌ రాణా తెలిపారు. మంగళవారం 101మంది పోలీసులను బదిలీ చేశారు.

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న ఎస్పీ

101 మంది పోలీసులకు కౌన్సెలింగ్‌

ఎస్పీ అదిరాజ్‌సింగ్‌ రాణా

నంద్యాల టౌన్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పోలీసుల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టినట్లు ఎస్పీ అదిరాజ్‌సింగ్‌ రాణా తెలిపారు. మంగళవారం 101మంది పోలీసులను బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బదిలీల ప్రక్రియలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బందికి బదిలీ చేశామన్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పోలీసు స్టేషన్ల ఖాళీలను చూపించి ఖాళీలకు అనుగుణంగా వారు కోరుకున్న స్థానాలకు సిబ్బందిని బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. సీనియారిటీ ఆధారంగా వారు కోరుకున్న చోటుకు స్థానచలనం చేశామన్నారు. ఒకే స్థానంలో ఐదేళ్లు పనిచేసిన వారి జాబితాను తయారు చేసి కౌన్సెలింగ్‌కు పిలిచామన్నారు. సిబ్బంది సంతృప్తి చెందినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌బాబు, డీపీవో సూపరింటెండెంట్‌ ఖాదర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐలు మోహన్‌రెడ్డి, సూర్యమౌళి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:00 AM