ప్రియుడి ఇంటి ఎదుట ట్రాన్స్‌జెండర్ ధర్నా
ABN, Publish Date - May 01 , 2025 | 12:33 AM
ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ఓ ట్రాన్స్ జెండర్ బైఠాయించి ఆందోళన చేసిన సంఘటన ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
ఆదోని రూరల్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ఓ ట్రాన్స్ జెండర్ బైఠాయించి ఆందోళన చేసిన సంఘటన ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత ట్రాన్స్‌జెండర్ కథనం మేరకు వివరాలు ఇలా... బైచిగేరి గ్రామానికి చెందిన గణేష్, హైదరాబాద్ సిటీ సనత్‌నగర్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ హాసిని గౌడ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచ యం అయ్యారు. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వారు గత కొంత కాలంగా సహజీవనం చేశారు. గణేష్ ప్రేమలో పడిన హాసిని గౌడ్ అతడికి ఖరీదైన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, దుస్తులతో పాటు రూ.లక్షల్లో డబ్బు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో గతేడాది జూన్‌లో వారిద్దరూ హైదరాబాద్ లోని ఓ ఆలయంలో వివాహం కూడా చేసుకున్నారు. ఈ విషయాన్ని గణేష్ తన ఇంట్లో చెప్ప కుండా కాలం వెళ్లదీశాడు. వివాహం అనంతరం గణేష్ సొంతూరికి వెళ్ళి తిరిగి రాకపోవడంతో మోసపో యానని తెలిసిన హాసినిగౌడ్ హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో యువకుడు గణేష్ ఓ వివాహం చేసుకున్నాడు. తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వరుస ఘటనలను నిలదీస్తూ ట్రాన్స్‌జెండర్ హాసిని గౌడ్ యువకుడి ఇంటి ఎదుట బైఠాయిం చింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. రెండు వివాహాల తర్వాత కూడా తనతో మాట్లాడుతున్నాడని, ముగ్గురం కలసి ఉందామని తనకు ఆశలు రేకెత్తించి మళ్లీ మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న తాలూక పోలీసులు గ్రామానికి చేరుకుని హాసినితో పాటు అక్కడ ఉన్న మిగిలిన ట్రాన్స్‌జెం డర్లను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.
Updated Date - May 01 , 2025 | 12:33 AM