మరుగుదొడ్డికి తాళం
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:21 AM
స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల మరుగుదొడ్లకు తాళం వేయడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు.
తాళం వేసిన జడ్పీ ఉన్నత పాఠశాల మరుగుదొడ్లు
హొళగుంద, జూలై 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల మరుగుదొడ్లకు తాళం వేయడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో 1,873 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2018లో కేంద్ర ప్రభుత్వం 12 మరుగుదొడ్లను నిర్మించింది. అయితే పాఠశాల నిర్వాహకులు తాళః వేశారు. హెచ్‌ఎం ఖాబీన్ సాబ్‌ను వివరణ కోరగా నీటి సౌకర్యం లేకపోవడంతో తాళం వేసినట్లు తెలిపారు.
Updated Date - Jul 18 , 2025 | 12:21 AM