ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు భ్రామరికి కుంభోత్సవం

ABN, Publish Date - Apr 15 , 2025 | 12:26 AM

శ్రీశైలం మహాక్షేత్రంలో మంగళ వారం భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది.

కుంభోత్సవానికి ముస్తాబైన అమ్మవారి ఆలయం

శ్రీశైలం, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రంలో మంగళ వారం భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. కుంభోత్సవానికి ఏర్పాట్లును దేవస్థానం ఇప్పటికే పూర్తి చేసింది. అమ్మవారికి ఉత్సవ సంబంధ కార్యక్ర మాలు సంపూర్ణంగా జరిపించాలని ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు అర్చకులకు, అధికారులకు సూచనలిచ్చారు. కుంభోత్సవం వేడుక అనంతరం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని క్యూలైన్లలో తొక్కిసలాట జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని దేవస్థానం భద్రత విభాగపు పర్యవేక్షకులను ఆదేశించారు. మంగళవారం జరుగనున్న కుంభోత్సవం సందర్భంగా శ్రీశైలం సీఐ జి. ప్రసాదరావు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఆది దంపతులకు వెండి రథోత్సవం: శ్రీశైల క్షేత్రంలో సోమ వారాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహించింది. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు.

Updated Date - Apr 15 , 2025 | 12:26 AM