ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు గురు పౌర్ణమి

ABN, Publish Date - Jul 09 , 2025 | 11:49 PM

గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తూ నిర్వహించుకునే వేడుక ‘గురు పౌర్ణమి’ని గురువారం జిల్లా వాసులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు.

కర్నూలు కల్చరల్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తూ నిర్వహించుకునే వేడుక ‘గురు పౌర్ణమి’ని గురువారం జిల్లా వాసులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఈ ఏడాది గురు పౌర్ణమి గురువారం రోజునే రావడం ప్రత్యేక విశేషంగా భక్తులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని షిరిడీ సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగానూ పేర్కొంటారు. ఇదే రోజున వేదవ్యాస మహర్షి జన్మతిథి కావడంతో, వేదాలు లోకానికి అందించిన వ్యాస భగవానుడిని ఈ వేడుకలో ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ నేపథ్యంలో షిరిడీ సాయిబాబా దేవాలయాల్లో, దత్తాత్రేయ మందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని షిరిడీ సాయిబాబా దేవాలయాల్లో, దత్తాత్రేయ మందిరాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు నగరంలోని ప్రముఖ ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated Date - Jul 09 , 2025 | 11:49 PM