ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం పర్యటనకు పటిష్ట భద్రత..

ABN, Publish Date - May 16 , 2025 | 11:37 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు నగరం పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

సీఎం పర్యటన స్థలం వద్ద పోలీసులు

1,700 మంది పోలీసులతో బందోబస్తు

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు నగరం పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి ప్రజావేదిక సభ జరిగే నంద్యాల చెక్‌పోస్టు వరకు, నంద్యాల చెక్‌పోస్టు నుంచి సీ.క్యాంపు వరకు, నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని పా ర్కు వరకు సీఎం పర్యటన సందర్బంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌, క్లూజ్‌టీం శుక్రవారం పర్యటించాయి. ఓర్వకల్లు నుంచి సీ.క్యాంపు రైతుబజారు వరకు ఉన్న మార్గాల్లో పలు క్రాస్‌ రోడ్లు ఉండటంతో పాటు కర్నూలు నగరంలో చెక్‌పోస్టు నుంచి సీ.క్యాంపు వరకు తీవ్ర రద్దీ ఉన్న నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాలోని పోలీసులను ఈ బందోబస్తుకు నియమించారు. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఉన్న మెగా సిరి ఫంక్షన్‌ హాలులో పోలీసులకు జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ పలు సూచనలు, సలహాలు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటించే రూట్‌ అండ్‌ రూప్‌ - టాప్‌ ప్రాంతాల్లో, సీఎం కాన్వాయ్‌, సభప్రాంగణం తదితర ప్రాంతాల్లో బందోబస్తు విధులు నిర్వహించే మఫ్టీ పోలీసులు, స్పెషల్‌ పార్టీ పోలీసు బృంధాలు, పోలీసు జాగీలాలు, బాంబ్‌ స్క్వాడ్‌ బృంధాలతో పోలీసు అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో నలుగురు ఏఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 53 మంది సీఐలు, 101 మంది ఎస్‌ఐలు, 383 మంది ఏఎ్‌సఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 680 మంది కానిస్టేబుళ్లు, 51 మంది మహిళా పోలీసులు, 416 మంది హోంగార్డులు, 5 సెక్షన్ల ఏఆర్‌ సిబ్బంది, 6 స్పెషల్‌ పార్టీ బృంధాలను బందోబస్తు విధులకు కేటాయించామన్నారు. ఈ పరిశీలనలో ఏఎస్పీ (అడ్మిన్‌) హుసేన్‌పీరా, ఏఆర్‌ ఏఎస్పీ కృష్ణమోహన్‌ కర్నూలు రేంజ్‌ పరిధిలోని ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి సీ.క్యాంపు రైతుబజారు వరకు ఏర్పాట్లన్నీ చకచకా పూర్తయ్యాయి. ఆగమేఘాల మీద యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు సిద్ధం చేశారు. జాతీయ రహదారిపై ఉన్న గుంతలన్నీ వెంట వెంటనే తారుతో పూడ్చివేశారు. ఈ మార్గంలో ఉన్న స్పీడ్‌ బ్రేకర్లన్నీ తొలిగించారు. డీవైడర్లకు రంగులు వేసి ముస్తాబు చేశారు. రైతుబజారు సమీపంలో ఉన్న చెత్తను తొలిగించేశారు. రోడ్డుకిరువైపులా గ్రావెల్‌ వేసి చదును చేశారు. పూర్తిగా దెబ్బతిన్న చోట బీటీ రోడ్డు వేశారు.

వాహనాల రాకపోకలు మళ్లింపు

ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలులో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా పోలీసులు శనివారం ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించారు. వివిధ ప్రాంతాల నుంచే వచ్చే వాహనాల రాకపోకలను మళ్లించారు.

ఆత్మకూరు, నందికొట్కూరు నుంచి వచ్చే వాహనాలు గార్గేయపురం ఎన్‌హెచ్‌ 350సీ మీదుగా సఫా కాలేజీ రింగ్‌ రోడ్డు, గుత్తి పెట్రోల్‌ బంకు, బళ్లారి చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండుకు వెళ్లాలి.

నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్‌ వైపు వెళ్లే వాహనాలు ఆర్టీసీ బస్టాండు నుంచి బళ్లారి చౌరస్తా, గుత్తి పెట్రోల్‌ బంకు, రింగ్‌ రోడ్డు సఫా కాలేజీ మీదుగా ఎన్‌హెచ్‌-40, ఎన్‌హెచ్‌-350 సీ హైవేల నుంచి వెళ్లాలి.

డోన్‌, అనంతపురం వైపు నుంచి వచ్చే వాహనాలు గుత్తి పెట్రోల్‌ బంకు చెన్నమ్మ సర్కిల్‌, బళ్లారి చౌరస్తా మీదుగా ఆర్‌టీసీ బస్టాండుకు వె ళ్లాలి. ప్రజలు ట్రాఫిక్‌ మళ్లింపును గమనించి సహకరించాలని తెలిపారు.

Updated Date - May 16 , 2025 | 11:40 PM