యోగాంధ్రకు పకడ్బందీగా ఏర్పాట్లు
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:55 PM
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
జిల్లావ్యాప్తంగా 4644 ప్రదేశాల్లో కార్యక్రమాలు
నంద్యాల కేంద్రంలో ఐదు వేల మందితో యోగాసనాలు
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లె, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో 4644ప్రదేశాల్లో కార్యక్రమాలు చేపడుతు న్నామన్నారు. జిల్లాలో 20లక్షల మంది జనాభా ఉండగా 8.5లక్షల మంది యోగాంధ్ర యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. నంద్యాలలోని టెక్కె మార్కెట్‌యార్డులో శనివారం ఉద యం 6.45గంటలనుంచి 8గంటల వరకు నిర్వహించే యోగాంధ్రకి ఐదు వేలమంది పాల్గొనేటట్లు ఏర్పాట్లు చేశామన్నారు. మార్కెట్‌యార్డులో 5వేదికలతోపాటు గ్రిడ్స్, పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదడ్లు, ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యేవారికి టీషర్టులు, క్యాప్స్ అందించాలని తాగునీరు, అల్పాహారం అందించేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక గ్రిడ్ ఏర్పాటుచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Updated Date - Jun 20 , 2025 | 11:55 PM