ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముగ్గురి అరెస్టు

ABN, Publish Date - Jul 22 , 2025 | 12:47 AM

నకిలీ పట్టాదారు పాస్‌ పుస్తకాల కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 12 నకిలీ పాస్‌బుక్‌లు, ఐదు నకిలీ టైటిల్‌డీడ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్‌ తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్‌

నకిలీ పాస్‌ పుస్తకాలు, నకిలీ టైటిల్‌ డీడ్‌లు స్వాధీనం

కోవెలకుంట్ల, జూలై 21 (ఆంధ్రజ్యోతి): నకిలీ పట్టాదారు పాస్‌ పుస్తకాల కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 12 నకిలీ పాస్‌బుక్‌లు, ఐదు నకిలీ టైటిల్‌డీడ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్‌ తెలిపారు. కోవెలకుంట్లలోని సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం సీఐ హనుమంతనాయక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడిం టచారు. 2023లో సంజామల తహసీల్దారు జీవీ మల్లికార్జున రావు ఫిర్యాదు మేరకు సంజామల పోలీసు స్టేషన్‌లో అప్పట్లో కేసు నమోదయింది. సంజామల తహసీల్దారు కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటరుగా పనిచేస్తన్న బషీర్‌ అహ్మద్‌, సంజామలకు చెందిన సాయ బోయిన ఉపేంద్ర కలిసి పేరుసోముల, గిద్దలూరు, ఆర్‌.లింగందిన్నె, ముదిగేడు తదితర గ్రామాల్లో లేని భూములను ఉన్నట్లుగా చూపుతూ కొత్త సర్వేనంబర్లు సృష్టించి సుమారు 55 మందికి నకిలీ పాస్‌ పుస్తకాలు ఇచ్చి ఆన్‌లైన్‌లో కూడా ఎక్కించారు. ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున పాస్‌బుక్కులు ఇచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు తీకున్నారు. వీరిలో 49 మంది వేర్వేరు బ్యాంకుల్లో సుమారు రూ.80 లక్షల వరకు రుణం తీసుకున్నారు. ఉపేంద్ర, బషీర్‌ అహ్మద్‌ వారికి తెలిసిన సంజా మలకు చెందిన ఇబూరి ప్రసాద్‌, గడివేములకు చెందిన దూదేకుల మహ్మద్‌ రఫీ, దూదేకుల పెద్ద జమాల్‌బాషా, కర్నూలుకు చెందిన అబ్దుల్‌ సత్తార్‌, కంపమల్లకు చెందిన వరప్రసాద్‌ కలిసి అమా యకులను ఎంపిక చేసుకున్నారు. వారికి నిజం చెప్పకుండా లేని భూమిని ఉన్నట్లుగా చెప్పి నకిలీ పాస్‌బుక్కులు ఇవ్వడంతో పాటు 2018లో అప్పటి తహసీల్దార్‌ ఎలిజబెత్‌ ఆన్‌లైన్‌కు అప్రూవల్‌ చేశారు. 06 సర్వే నెంబరు సృష్టించి 321.83 ఎకరాలు లేని భూమి ఉన్నట్లుగా చూపించి 67 మందికి ఆన్‌లైన్‌ ఎక్కించి 55 మందికి పాస్‌బుక్కులు ఇచ్చారు. ఈ పాస్‌బుక్‌లు తీసుకున్న వారందరూ సంజామల, కోవెల కుంట్ల, గడివేముల, నందికొట్కూరు, కర్నూలు జిల్లాకు చెందిన వారిగా తెలిసింది. బ్యాంకుల్లో నకిలీ పాసు పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్న వారు తిరిగి రుణాన్ని చెల్లించాలని, లేకపోతే వారిపై చర్యలు తీసుకుం టామని డీఎస్పీ తెలిపారు. సంజామల గ్రామానికి చెందిన సాయ బోయిన ఉపేంద్ర, ఇపూరి వరప్రసాద్‌, దూదేకుల మహ్మద్‌రఫీని విచారించినట్లు తెలిపారు. సంజామల ఎస్‌ఐ రమణయ్య ఉన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 12:47 AM