కలెక్టర్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
ABN, Publish Date - Apr 24 , 2025 | 01:19 AM
పదో తరగతి పరీక్షల్లో తాము వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తామని జొన్నగిరి ఎస్సీ హాస్టల్ విద్యార్థులు కలెక్టర్ రంజిత్ బాషాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
వంద శాతం ఉత్తీర్ణత సాధించిన జొన్నగిరి ఎస్సీ హాస్టల్ విద్యార్థులు
తుగ్గలి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో తాము వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తామని జొన్నగిరి ఎస్సీ హాస్టల్ విద్యార్థులు కలెక్టర్ రంజిత్ బాషాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సెప్టెంబర్‌లో కలెక్టర్ రంజిత్ బాషా హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వందశాతం పాస్ కావాలని కలెక్టర్ కోరగా అందుకు విద్యార్థులు 22 మంది ఉన్నామని అందరం పాస్ అవుతామని హామీ ఇచ్చారు. శివప్రసాద్ నాయక్ 519 మార్కులు సాధింగా, 7మంది విద్యార్థులు పస్‌క్టా్‌సలో, 13 మంది సెకండ్ క్లాస్‌లో ఇద్దరు థర్డ్ క్లాసులో పాసయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులను వార్డెన్ రమేష్, విద్యాకమిటీ చైర్మన్ రవికుమార్ యాదవ్ అభినందిచారు.
Updated Date - Apr 24 , 2025 | 01:19 AM