సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు: కమిషనర్
ABN, Publish Date - Jul 01 , 2025 | 01:06 AM
ప్రజా సమస్యల పరిష్కారరంలో జాప్యం చేయరాదని కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు.
కర్నూలు న్యూసిటీ, జూన 30(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారరంలో జాప్యం చేయరాదని కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 17 అర్జీలు వచ్చాయి. అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిష నర్ సతీష్‌రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి కె.విశ్వే శ్వరరెడ్డి, సిటీ ప్లానర్ ప్రదీప్‌కుమార్, ఎంఈ లీలప్రసాద్, ఆర్‌ఓ జునైద్ పాల్గొన్నారు.
ఫ నగరంలో రైతాంగ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మకు విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఏపీ రజక వృత్తిదారుల సం ఘం జిల్లా కార్యదర్శి సి.గురుశేఖర్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ రవీంద్రబాబుకు వినతిపత్రం అందజే శారు. కార్యక్రమంలో సి.శేషాద్రి, రాముడు, జయమ్మ పాల్గొన్నారు.
ఫ 43, 44 వార్డులలో కలుషిత నీరు వస్తుందని తక్షణమే అరికట్టి ప్రజలకు ఫిల్టర్ నీటిని అందించాలని సీపీఎం జిల్లా నాయకురాలు పి.నిర్మల కోరారు. కమిషనర్ రవీంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. నిర్మల మాట్లాడుతూ ఇందిరాగాంఽధీ నగర్, పీవీ నరసింహరావు, ఇల్లూరునగర్, సీతారం నగర్, ఎస్‌బీఐ కాలనీ, ఎల్‌ఐసీ కాలనీల్లో గత రెండు రోజులుగా వండ్రుతో కూడిన కలుషిత నీరు కొళాయిల ద్వారా వస్తున్నాయని కమిషనర్‌కు నీటిని చూపిం చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాముడు, సి.గురుశేఖర్, పీఎస్. సుజాత, సావిత్రి, పర్వీన, భారతి పాల్గొన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 01:06 AM