తాళం వేసిన ఇంట్లో చోరీ
ABN, Publish Date - May 09 , 2025 | 12:39 AM
తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి పట్టణంలో చోటుచేసుకుంది.
బంగారు ఆభరణాల అపహరణ
గూడూరు, మే 8(ఆంధ్రజ్యోతి): తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గూడూరు పట్టణంలో రాజవీధి క్వార్టర్స్‌లోని ఓ ఇంట్లో సీఐటీయూ డివిజన కార్యదర్శి మోహన భార్యా పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. బుధవారం అతడు కుటుం బంతో కలిసి అనంతపురం జిల్లా యాడికిలో బంధువుల ఇంట్లో ఫంక్ష నకు వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో చూసి గుర్తుతెలియని దుండగులు తలుపులు పగులగొట్టి బీరువాలోని మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, పది తులాల వెండి ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. గురువారం చోరీ విషయాన్ని గమనించిన ఇంటిపక్కల వారు మోహనకు సమాచారం అందించారు. అతడు హుటాహుటిన గూడూ రుకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు.
Updated Date - May 09 , 2025 | 12:39 AM