ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సైనికుల త్యాగాలు మరువలేనివి

ABN, Publish Date - May 18 , 2025 | 11:37 PM

దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలు మరువలేనివని ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎంపీ, కలెక్టర్‌

పాక్‌కు అర్థమయ్యేలా జవాబు ఇచ్చిన భారత్‌

ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాలలో తిరంగా ర్యాలీ

సైనికులు, మాజీ సైనికులకు సన్మానం

నంద్యాల కల్చరల్‌, మే 18(ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలు మరువలేనివని ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని టెక్క మార్కెట్‌యార్డు నుంచి గాంధీచౌక్‌ వరకు భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయోత్సవం సందర్భంగా త్రివిధ దళాల సైనికులకు సంఘీ భావంగా తిరంగా ర్యాలీ నిర్వహి స్తున్నా మన్నారు. తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ ధన్య వాదాలు తెలిపారు. ఎంపీ బైరెడ్డి శబరి మాట్లా డుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌కు అర్థమయ్యేలా ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో భారత్‌ జవాబు చెప్పిందన్నారు. ఉగ్రవాదులకు భూమి మీద బతికే అర్హత లేదన్నారు. ఉత్సాహంగా సాగిన ఈ ర్యాలీ గాంధీచౌక్‌ చేరుకొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్‌ రాజకుమారి, ఎంపీ శబరి అమరజవాన్‌ మురళీనాయక్‌కు, పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు. అనంతరం సైనికులను, మాజీ సైనికులను సన్మానించారు. ఈ తిరంగా ర్యాలీలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, డాక్టర్‌ రామక్రిష్ణారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్‌ అధ్యక్షులు ముస్తాక్‌ అహమ్మద్‌, టీడీపీ యువనేత ఫిరోజ్‌, బీజేపీ, జనసేన, టీ డీపీ నాయకులు, మాజీ సైనికులు, సైనిక కుటుంబాలు, బార్‌ అసోషి యేన్‌, నంద్యాల వైద్యుల సంఘం, ప్రైవేటు విద్యాసంస్ధల అధినేతలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్ధి, మహిళా, పలు సంఘాల ప్రతినిధులు, ఎన్‌సిసి విద్యార్ధులు, రెడ్‌క్రాస్‌ ప్రతినిఽధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 11:37 PM