ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పార్క్‌ స్థలాన్ని ఖాళీ చేయాలి

ABN, Publish Date - Jun 22 , 2025 | 12:04 AM

కల్లూరు అర్బన 19వ వార్డులో పార్క్‌ స్థలాన్ని తక్షణమే ఖాళీచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య హెచ్చరించారు.

పార్క్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

కల్లూరు, జూన 21(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన 19వ వార్డులో పార్క్‌ స్థలాన్ని తక్షణమే ఖాళీచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య హెచ్చరించారు. శనివారం 19వ వార్డు నాలుగో తరగతి ఉద్యో గుల కాలనీ ఎల్‌పీ నెంబరు 116-89లో అన్యాక్రాంతమైన పార్క్‌ స్థలాన్ని నగరపాలక కమిషనర్‌ రవీంద్రబాబు, ఆర్డీఓ సందీప్‌లతో కలిసి జేసీ పరిశీలించారు. పార్క్‌ స్థలంలో నివాసముంటున్న వారితో మాట్లాడి వారి సమస్యలు విన్నారు. పార్క్‌ స్థలంలో నివాసాలు ఏర్పాటు చేయ డం కోర్టు ఆదేశాలకు విరుద్ధమని ఖాళీ చేయాలని వివరించారు. అక్కడ ఉన్న ప్రజల అభ్యర్థన మేరకు గృహాలకోసం దరఖాస్తు చేసు కుంటే అర్హతలను బట్టి మంజూరు చేస్తామని జేసీ తెలిపారు. అన్యా క్రాంతమైన పార్క్‌ స్థలం స్థితిగతులను సర్వే చేసి పూర్తి వివ రాలతో నివేదిక ఇవ్వాలని రెవిన్యూ, మున్సిపల్‌ అధికారులను ఆదేశిం చారు. ఆమె వెంట సిటీ ప్లానర్‌ ప్రదీప్‌కుమార్‌, వీఆర్వోలు ఉన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 12:04 AM