పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:25 AM
నంద్యాల పట్టణంలోని 36వ వార్డులో రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సామాజిక పింఛన్లు పంఫిణీ చేశారు.
నంద్యాల రూరల్ జూలై 1(ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణంలోని 36వ వార్డులో రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సామాజిక పింఛన్లు పంఫిణీ చేశారు. మంగళవారం వార్డు ఇన్‌చార్జి మారుతి ప్రసాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.4వేలకు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏడాదికి కొంత మొత్తాన్ని పెంచి ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ దాస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 12:25 AM