ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎండీయూ వ్యవస్థను కొనసాగించాలి

ABN, Publish Date - May 24 , 2025 | 01:19 AM

రేషన పంపిణీకి సంబంధించి ఎండీయూ వాహనాల ద్వారానే కొనసాగించాలని ఎండీ యూ ఆపరేటర్ల అసోసియేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజా డిమాండ్‌ చేశారు.

ధర్నా చేస్తున్న ఎండీయూ వాహనాల ఆపరేటర్లు

నంద్యాల నూనెపల్లె, మే 23(ఆంధ్రజ్యోతి): రేషన పంపిణీకి సంబంధించి ఎండీయూ వాహనాల ద్వారానే కొనసాగించాలని ఎండీ యూ ఆపరేటర్ల అసోసియేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజా డిమాండ్‌ చేశారు. జూన ఒకటి నుంచి ఎండీయూ వాహనాల ద్వారా రేషన పంపి ణీ వ్యవస్థను రద్దుచేయడంతో ఆ వాహనాల ఆపరేటర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. శుక్రవారం నంద్యాలలోని సీపీఎం కార్యాలయం నుంచి సాయిబాబానగర్‌, పద్మావతినగర్‌, మున్సిపల్‌ కార్యా లయం, బొమ్మలసత్రం మీదుగా ఎండీయూ వాహనాలతో ర్యాలీ నిర్వ హించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తోటమద్దులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్‌, మహమ్మద్‌గౌస్‌ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాహనాలు తీసుకుని ప్రతినెలా ఈఎంఐలు చెల్లిస్తూ ఇంటింటికి వెళ్లి బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అర్ధాంతరంగా ఎండీయూ వ్యవస్థను తొలగించడం ప్రభుత్వానికి తగదన్నారు. దాదాపు 10వేలమంది కార్మికులు వీధిన పడ్డాల్సి వస్తోందన్నారు. గత ప్రభు త్వంలో జరిగిన తప్పులను సవరించి మరింత పటిష్టంగా పంపిణీ వ్యవస్థను తమద్వారానే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం డీఆర్వో రామునాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, ఎండీయూ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 01:19 AM