ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహనీయుడు జ్యోతిబా పూలే

ABN, Publish Date - Apr 11 , 2025 | 11:32 PM

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా అన్నారు.

నివాళి అర్పిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌ తదితరులు

కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా

కర్నూలు ఎడ్యుకేషన్‌ , ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా అన్నారు. జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధ్వర్యంలో శుక్రవారం స్థానిక బిర్లా గేట్‌ కూడలిలో జ్యోతిబా పూలే విగ్రహానికి కలెక్టర్‌ రంజిత్‌బాషా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఒక పండుగలాగా దేశమంతా జరుపుకుంటునారని అన్నారు. ఆయన ఆశయాలకు అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా కార్పొరేషన్లకు బడ్జెట్‌ కేటాయించి, స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తున్నదన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ జ్యోతిబా పూలే కుల వివక్షను రూపుమాపాలనే లక్ష్యంతో పని చేశారన్నారు. కుల, లింగ విభేదాలు నశించి అన్ని రంగాల్లో సమానత్వం కోసం పోరాడారని కొనియాడారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు మాట్లాడుతూ అంటరాతనం, వర్ణ వ్యవస్థ, స్త్రీ విద్య కోసం ఆయన సమాజంలో విప్లవాన్ని తీసుకువచ్చారని తె లిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీసీ ఆర్థికంగా వెనుకబడిన వారికి కాపు కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి పథకం కింద 108 మంది లబ్ధిదారులకు రూ.11.77 కోట్ల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కే.ఈ. ప్రభాకర్‌, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. నాగేశ్వరరావు యాదవ్‌, కురువ సంఘం డైరెక్టర్‌ రామక్రిష్ణ, టీడీపీ నంద్యాల పార్లమెంటు అధ్యక్షురాలు పార్వతి, ధనుంజయ ఆచారి, శేషఫణి, వాడాల నాగరాజు, వెంకటేశ్వర్లు, మధు, బాలసంజన్న, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యల సంఘం జిల్లా అధ్యక్షుడు బి. వాసుదేవయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 11:32 PM