వైభవంగా కవీంద్ర తీర్థుల పూర్వారాధన
ABN, Publish Date - Apr 06 , 2025 | 12:47 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పరమగురువులైన పూర్వపు పీఠాధిపతి కవీంద్ర తీర్థుల పూర్వారాధన మహోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.
మంత్రాలయం, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పరమగురువులైన పూర్వపు పీఠాధిపతి కవీంద్ర తీర్థుల పూర్వారాధన మహోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. కర్ణాటకలోని అనుగొంది నవబృందావనంలో వెలసిన కవీంద్ర తీర్థుల బృందావనానికి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేశారు. శనివారం వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య బృందావనానికి నిర్మల విసర్జనం, క్షీరాభిషేకం, విశేష పంచామృతాభిషేకం నిర్వహించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు, పట్టు వస్ర్తాలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. సంస్థాన పూజలో భాగంగా మూలరాములకు విశేషంగా బంగారు నాణేలతో అభిషేకం చేశారు. భక్తులకు వేదపండితులు కవీంద్ర తీర్థుల ప్రవచన సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ద్వారపాలక అనంతస్వామి, ప్రకాష్‌ఆచార్, పవన ఆచర్, విజయేంద్రాచార్, ఆనందతీర్థఆచార్, గౌతమ్ ఆచార్, గోపాలకృష్ణస్వామి, వరధేంద్రాచార్, భక్తులు పాల్గొన్నారు.
Updated Date - Apr 06 , 2025 | 12:47 AM