విద్యాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - Jul 11 , 2025 | 01:01 AM
విద్యాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి
అట్టహాసంగా మెగా పీటీఎం కార్యక్రమం
సి.బెళగల్, జూలై 10(అంధ్రజ్యోతి): విద్యాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. గురువారం మండల కేంద్రమైన సి.బెళగల్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యకమిటీ చైర్మన గోవిందు అధ్యక్షతన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వ హించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. అలాగే అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ చింతలయ్య అధ్యక్షతన మెగా పీటీఎం కార్యక్ర మం జరిగింది. ఈసందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీ లు నిర్వహించి, విజేత లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్ర మంలో కెనరా బ్యాంక్ మేనేజర్ ప్రసంగి, వైద్యాధికారి వెంకటేశ్వర్లు, తహ సీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీవో రాణెమ్మ, ఎంఈవోలు జ్యోతి, ఆదాంబాషా, హెచఎంలు, ఉపాధ్యాయులు, ఎంపీపీ బొంతల మునెప్ప, టీడీపీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Updated Date - Jul 11 , 2025 | 01:01 AM