ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN, Publish Date - Apr 10 , 2025 | 12:57 AM
ప్రజా సమస్యల పరిష్కారామే ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారామే ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. బుధవారం స్థానిక మాధవీ నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గౌరు చరిత మాట్లాడుతూ అర్జీలను సం బంధిత శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలని సూచిం చారు. కార్యక్రమంలో ప్రజలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
హైస్కూల్‌గా అప్‌గ్రెడ్ చేయాలి: నగరంలోని బి.క్యాంపు మున్సిపల్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను హైస్కూల్‌గా అప్‌గ్రెడ్ చేయాలని విద్యా ర్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు కోరారు. బుధవారం ఎమ్మె ల్యే గౌరు చరితకు వినతిపత్రం అందజేశారు. సదరు పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు 371 మంది విద్యార్థులు చదువుకుంటు న్నారని, క్లస్టర్ విభజన పునర్వ్యవస్తీకరణలో భాగంగా ఈ పాఠశాలను డిగ్రేడ్ చేయడానికి విద్యాశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యేకు వివరించారు.
Updated Date - Apr 10 , 2025 | 12:57 AM