వైభవంగా మహానందీశ్వరుడి కల్యాణం
ABN, Publish Date - May 18 , 2025 | 11:34 PM
మహానంది క్షేత్రంలో ఆదివారం ఘనంగా మహానందీశ్వరుడి కల్యాణం నిర్వహించారు. ఆలయం ప్రాంగణం లోని అలంకార మంటపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఆశీనులు గావించారు.
మహానంది, మే 18 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో ఆదివారం ఘనంగా మహానందీశ్వరుడి కల్యాణం నిర్వహించారు. ఆలయం ప్రాంగణం లోని అలంకార మంటపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఆశీనులు గావించారు. అనంతరం వేదపండితుడు నాగేశ్వరశర్మ, సహాయ అర్చకుడు పుల్లూరి జనార్దన్‌శర్మ వేదమంత్రాలతో కల్యాణం జరిపారు. దాతలుగా విద్యుత్‌శాఖ ఏఈ ప్రభాకర్‌రెడ్డి దంపతులు వ్యవహరించారు. మహానంది క్షేత్రం ఆదివారం భక్తుల రద్దీతో పులకించింది. వీకెండ్‌తో పాటు వివాహాలకు మంచి ముహూర్తం ఉండటంతో క్షేత్రంలో పదుల సంఖ్యలో పెళ్లిళ్లు జరగడంతో బంధుగణంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. స్వామివారి దర్శనం కోసం వచ్చిన వేలాదిమంది భక్తులు ముందుగా ప్రాంగణంలోని కోనేర్లల్లో పుణ్య స్నానాలు ఆచరించడంతో పరిసరాలు రద్దీ వాతవరణం నెలకొన్నాయి. దేవస్థానానికి వివిధ సేవల ద్వారా రూ. లక్షలాది ఆదాయం వచ్చినట్లు ఏఈవో యర్రమల్ల మధు తెలిపారు.
Updated Date - May 18 , 2025 | 11:34 PM