స్వర్ణరథంపై ఆది దంపతులు
ABN, Publish Date - Jul 23 , 2025 | 11:27 PM
: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మల్లికార్జునస్వామి, భ్రమరాంబికదేవి బుధవారం స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీశైలంలో ఘనంగా ఆరుద్ర నక్షత్ర వేడుకలు
నంద్యాల కల్చరల్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మల్లికార్జునస్వామి, భ్రమరాంబికదేవి బుధవారం స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. శివయ్య జన్మనక్షతం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు చేపట్టారు. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు స్వామి అమ్మ వార్లకు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను బంగారురథంపై అధిష్టింపజేశారు. భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు స్వర్ణరథోత్సవాన్ని నిర్వహించారు. కళాకారులు కోలాటం, తప్పెట, బిందు మొదలైన కళారూపాలు ప్రదర్శి స్తుండగా రథోత్సవం కోలాహలంగా సాగింది. ఈ వేడుకకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
Updated Date - Jul 23 , 2025 | 11:27 PM