ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పేదరిక నిర్మూలనే ముఖ్యమంత్రి లక్ష్యం

ABN, Publish Date - Apr 21 , 2025 | 12:30 AM

రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.

చంద్రబాబు జన్మదిన వేడుకల్లో కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు

బడుగువర్గాల అభ్యున్నతికి కృషి

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

ఘనంగా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు

కర్నూలు, అర్బన్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌, మాజీ ఎంపీ సంజీవ్‌కుమార్‌తో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం కేక్‌ కట్‌చేసి సంబ రాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 ఏళ్ల వయస్సులోనే రాజకీయ జీవితం ప్రారంభించి సీఎంగా ఉమ్మడి తెలుగురాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన అరుదైన అవకాశం సొంతం చేసుకున్నార ని కొనియాడారు. బడుగువర్గాల అభ్యున్నతికి ఆనాటి నుంచి నేటి వరకు వారి కోసం ఆహర్నిశలు పనిచేశారని గుర్తు చేసుకున్నారు. నిరుద్యోగ యువకుల కోసం తన జన్మదిన కానుకగా 16,345 ఉపాఽధ్యాయ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్‌ జారీచేశారని, గతంలో 1995-99 కాలంలో సీఎంగా80 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేశారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్‌, కేఈ జగదీష్‌, నంద్యాల నాగేంద్ర, ధరూర్‌ జేమ్స్‌, పోతురాజు రవీకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 12:30 AM