బానకచర్ల ప్రాజెక్టు ఓ గేమ్ ఛేంజర్
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:21 AM
బానకచర్ల ప్రాజెక్టు ఓ గేమ్ ఛేంజర్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
రాజకీయ ఉనికికోసమే తెలంగాణ పార్టీల తాపత్రయం
రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి
పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల
పాల్గొన్న ఎంపీ శబరి, ఎమ్మెల్యే జయసూర్య
జూపాడుబంగ్లా, జూలై 6(ఆంధ్రజ్యోతి): బానకచర్ల ప్రాజెక్టు ఓ గేమ్ ఛేంజర్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రితో కలిసి నంద్యాల ఎంపీ శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యతో కలిసి పోతిరెడ్డిపాడు నుంచి దిగువకు ఎస్సారెబ్సీ కాలువలోకి నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరద లు వచ్చిన సమయంలో సముద్రంలోకి వృఽథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి బానకచర్లకు మళ్లించి రాయలసీమకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతుంటే దీన్ని తెలంగాణ పార్టీలు తమ ఉనికిని చాటుకునేందుకు తాపత్రయం పడుతున్నారన్నారు. మిడుతూరు మండలంలోని అలగనూరు రిజర్వాయర్ గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలతో ప్రాజెక్టు పూర్తికాలేదని, రూ.30కోట్లతో పూర్తయ్యే రిజర్వాయర్ ప్రస్తుతం రూ.100కోట్లకు పెరిగే పరిస్థితి నెలకొందన్నారు. త్వరలో అలగనూరు రిజర్వాయర్ మరమ్మతు పనులు చేపడుతామన్నారు. ఎన్నడూలేని విదంగా జూలై మొదటి వారంలోనే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని అందిస్తున్నామని రైతులు వృఽథా చేయకుండా నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం 5వేల క్యూసెక్కులను దిగవకు వదులుతు న్నామని అన్నారు. నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రెడ్డిశేఖర్‌రెడ్డి, ఈఈ నాగేంద్ర కుమార్, ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ ప్రసాదరెడ్డి, మున్సిపల్‌చైర్మన్ సుధాకర్‌రెడ్డి, పోతులపాడు సర్పంచ్ నిర్మలమ్మ, టీడీపీ నాయకులు మాండ్రసురేంద్రనాథ రెడ్డి, వెంకటేశ్వరు ్లయాదవ్, మోహ న్‌రెడ్డి, రవి కాంత్, శివానందరెడ్డి, నాగేశ్వరరావు, చిన్నవెంకటస్వామి, సైఫుద్దీన్, రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 12:21 AM