ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠాలు చెప్పిన పాలనాధికారి..!

ABN, Publish Date - Jun 18 , 2025 | 12:11 AM

జిల్లా పరిపాలన విధుల్లో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్‌ రాజకుమారి... కాసేపు పిల్లలకు పాఠాలు బోధిస్తూ టీచర్‌గా మారారు.

ఉపాధ్యాయురాలిగా పాఠాలు బోధిస్తున్న కలెక ్టరు రాజకుమారి

పాణ్యం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిపాలన విధుల్లో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్‌ రాజకుమారి... కాసేపు పిల్లలకు పాఠాలు బోధిస్తూ టీచర్‌గా మారారు. ఈ అరుదైన ఘటన పాణ్యం మండలంలో చోటు చేసుకుంది. జిల్లా పాలనాధికారి తమకు పాఠాలు చెప్పడంపై విద్యార్థులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే... పాణ్యం మండలంలోని సుగాలిమెట్ట సమీపంలోని మోడల్‌ పాఠశాలను కలెక్టర్‌ రాజకుమారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్నారు. తాగునీరు, అప్రోచ్‌ రోడ్డు సమస్య ప్రధానంగా ఉందని ప్రిన్సిపాల్‌ కలెక్టరుకు తెలిపారు. విద్యార్థుల హాజరు, విద్యార్థుల సంఖ్యవివరాలు తెలుసుకున్నారు. ప్రయోగశాలలో పరికరాలపై ఆరా తీశారు. పాఠశాల చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీసీ రోడ్డు, తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. అనంతరం పదో తరగతిగదిని పరిశీలించి విద్యార్థినులకు ఆంగ్ల పాఠాలు బోధించారు. పోటీపరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో వివరించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంతేకాకుండా చిన్నారులకు కలెక్టర్‌ స్వయంగా భోజనం తినిపించారు. కలెక్టర్‌ వెంట ఎంఈవో కోటయ్య, ప్రిన్సిపాల్‌ దినే్‌షబాబు, పాఠశాల సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:11 AM