రైతు అభివృద్ధే టీడీపీ ధ్యేయం
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:22 AM
రైతుల అభివృద్ధే తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యని ర్వహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, తెలుగురైతు ఉపాధ్యక్షు డు మనోహర్ చౌదరి, తిమ్మయ్య చౌదరి అన్నారు.
వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసిన నాయకులు
తుగ్గలి, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): రైతుల అభివృద్ధే తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యని ర్వహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, తెలుగురైతు ఉపాధ్యక్షు డు మనోహర్ చౌదరి, తిమ్మయ్య చౌదరి అన్నారు. శనివారం తుగ్గలిలో ఏవో పవన్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. వైసీపీ దగాతో రైతులు నష్టపోయారని, వ్యవసాయాన్ని లాభసా టిగా మార్చేందుకే వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ పరిక రాలు, స్ర్పింకర్లను వందశాతంతో సబ్సిడీతో ఇస్తున్నామ న్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు మండలానికి 1605 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు వచ్చాయని వచ్చాయనీ, రాయితీతో క్వింటం రూ.5,580లకు ఇస్తున్నామ న్నారు. విత్తనాలు వేసే సమయంలో ఖచ్చితంగా విత్తనశుద్ధి పాటిం చాలని సూచించారు. టీడీపీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, వెంకటేశ్ మాజీ వైస్‌ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, టీడీపీ నాయకులు మిద్దె రవికుమార్, బాలన్న, వల్లె వెంకటేశ్, సర్పంచ్ రవి, హనుమంతు, మైరాముడు, కృష్ణ, తదితరులు ఉన్నారు.
Updated Date - Jun 08 , 2025 | 12:22 AM