ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పారిశుధ్య చర్యలు చేపట్టండి: కలెక్టర్‌

ABN, Publish Date - May 27 , 2025 | 11:36 PM

: గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, మే 27 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, ఐహెచ్‌ఎల్‌, సోక్‌పిట్స్‌, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌, చెత్తసంపద తయారీ కేంద్రాలు తదితర అంశాలపై డీఆర్‌ఈవో, డీఈఈ, ఏఈ, డిప్యూటీ ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు, ఎమ్మార్సీలతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 24పర్యాటక కేంద్రాల్లో పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి 15రోజులకోసారి గ్రామాల్లోని ట్యాంకులను పరిశుభ్రం చేసి తేదీని ట్యాంక్‌పై రాయాలని ఆదేశాలు జారీ చేశారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు ప్రతి నెలా నిర్వహిస్తున్న కార్యక్రమాల ఫొటోలు సేకరించి సచివాలయం, మండల కార్యాలయాల్లో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, ఇన్‌చార్జి డీపీవో శివారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మనోహర్‌, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, డీపీఆర్సీ మంజులవాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:36 PM