ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సస్యరక్షణ చర్యలు చేపట్టండి: శాస్త్రవేత్త

ABN, Publish Date - Jul 31 , 2025 | 12:27 AM

రైతులు సాగు చేసిన పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సుజాతమ్మ అన్నారు.

పత్తి పంటను పరిశీలిస్తున్న డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త సుజాతమ్మ, అధికారులు

ఓర్వకల్లు, జూలై 30(ఆంధ్రజ్యోతి): రైతులు సాగు చేసిన పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సుజాతమ్మ అన్నారు. బుధవారం మండలంలోని తిప్పాయ పల్లె, హుశేనాపురం గ్రామాల్లో రైతులు వేసిన పత్తి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. రైతులకు తెగుళ్లపై అవగాహన కల్పిం చారు. సుజాతమ్మ మాట్లాడుతూ పత్తి పంటలో గులాబి పురుగు నివారణకు పంట వేసిన 25 రోజులకు వేపనూనె, 45-50 రోజులకు ప్రేపోనోపాస్‌, 115 రోజులకు ఎల్‌ఏఎండీఏ తరహాలో పిచికారి చేయాలని, పంటలో అక్కడక్కడ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పెనుబంక తెగుళ్ల నివారణకు ఇమి డాప్రోఫైడ్‌ 80 మి.మీటర్లు ఎకరాకు డైపెంతూరియన 250 మిలీ మీటర్ల నీటితో కలిపి పంటపై పిచికారి చేయాలన్నారు. ఆమె వెంట డీఆర్‌సీ ఏడీఏ జీఎం వేద మణి, ఓర్వకల్లు వ్యవసాయాధికారి మధు మతి, ఏఈవోలు భాస్కర్‌, మధు, వీఏఏ మాధవీలత, దేవకుమార్‌, రైతులు ఉన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:27 AM