ఘనంగా సుయతీంద్రతీర్థుల ఆరాధనోత్సవాలు
ABN, Publish Date - Mar 19 , 2025 | 01:02 AM
రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంధ్రతీర్థుల 12వ మహా సమారాధ నోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
మంత్రాలయం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంధ్రతీర్థుల 12వ మహా సమారాధ నోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం మంత్రాల యం నవనిర్మాణ శిల్పిగా పేరొందిన ప్రస్తుత పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులకు పీఠం ఇచ్చిన గురువు సుయతీంధ్రతీర్థుల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. బంగారు, వెండి ఆభరణా లతోపాటు పట్టువస్త్రాలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయానుమానంగా అలంకరించారు. యాగశాలలో పీఠాధిపతి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మూలరాములు, జయరాములు, దిగ్విజ యరాములకు బంగారు నాణేలతో అభిషేకం చేసి హారతులు ఇచ్చారు. కార్యక్రమంలో పండిత కేసరి విద్వాన డాక్టర్ రాజాఎస్‌గిరిరాజాచార్, ఎస్‌ఎన వెంకటేశాచార్, ఎస్‌ఎన రఘునందనఆచార్, ఏఏవో మాధవ శెట్టి, మఠం మేనేజర్లు వెంకటేశజోషి, శ్రీపతాచార్, సురేష్ కోనాపూర్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఏఈ బద్రినాథ్, వాధిరాజా చార్, ప్రకాషాచార్, ద్వారపాలక అనంతస్వామి, విజేంద్రచార్, అనంతపు రాణిక్, రవికులకర్ణి, జేపీ స్వామి, వాధేంద్రచార్, జేపీ స్వామి, డీఎం ఆనందరావు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రవచనాలు: సుయతీంధ్రతీర్థుల ఆరాధనలో భాగంగా యాగశాలలో రాయచూరు చెందిన విద్వాన ప్రాణేష్ కురిడి, రాయచూరు చెందిన విద్వాన వరధేంద్ర గంగఖేడ్, బెంగుళూరు చెందిన విద్వాన పండిత శ్యామాచార్ ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వీరికి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మెమెంటో శేషవస్త్రం, ఫలపుష్ఫ మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.
Updated Date - Mar 19 , 2025 | 01:02 AM