సురేంద్ర మృతి తీరని లోటు
ABN, Publish Date - Apr 22 , 2025 | 12:35 AM
తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సురేంద్రనాయుడి మృతి పార్టీకి తీరనిలోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి, ఆలూరు ఇన్‌చార్జ్ వీరభద్ర గౌడ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వైకుంఠ శివప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గుమ్మనూర్ నారాయణ అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి
ఆలూరు, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సురేంద్రనాయుడి మృతి పార్టీకి తీరనిలోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్యాలకుర్తి తిక్కారెడ్డి, ఆలూరు ఇన్‌చార్జ్ వీరభద్ర గౌడ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వైకుంఠ శివప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గుమ్మనూర్ నారాయణ అన్నారు. గుండె పోటుతో మృతిచెందిన సురేంద్ర పార్థివ దేహానికి వారు సోమవారం నివాళి అర్పించారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి అర్థిక సాయం అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు మీనాక్షి నాయుడు, రామ్ భీం నాయుడు, టీడీపీ నాయకులు రామ్‌నాథ్ యాదవ్, ప్రసాద్ రెడ్డి, నారాయణ రెడ్డి, అశోక్, నరసప్ప, రాము, జగన్, ముద్దు రంగ, కొమ్ము రామాంజినేయులు, జనసేన నాయకులు రంజిత్, చత్రపతి పాల్గొన్నారు.
టీడీపీ అండగా ఉంటుంది
ఎక్స్‌లో పోస్ట్ చేసిన నారా లోకేష్
తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర మృతి కలచివేసిందని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు.
Updated Date - Apr 22 , 2025 | 12:35 AM