రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలి
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:07 AM
లబ్ధిదారు లకు రేషన్‌ను సక్రమంగా పంపిణీ చేయాలని ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ఆదేశించారు. బుధవారం కార్యాలయంలో మండల రేషన్ డీలర్లు, రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు
వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దే పంపిణీ చేయాలి : సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, జూన్25(ఆంధ్రజ్యోతి): లబ్ధిదారు లకు రేషన్‌ను సక్రమంగా పంపిణీ చేయాలని ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ఆదేశించారు. బుధవారం కార్యాలయంలో మండల రేషన్ డీలర్లు, రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆదోనిలో 116 దుకా ణాలు, 79,400 రేషన్‌కార్డులు ఉన్నాయన్నారు. దుకాణాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరచి, సరుకులు పంపిణీ ప్రక్రియ చేయాలన్నారు. పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకుని తాగునీటి సదు పాయం కల్పించాలన్నారు. తూకాల్లో పొరపాటు జరిగితే చర్యలు తప్పవన్నారు. ఆదోని మండలంలో 70 శాతం మాత్రమే ఈకేవైసీ పూర్తి అయ్యిందని, నిర్ణీత గడువు లోపు వందశాతం చేయాలన్నారు. తహసీల్దార్ రమేష్, పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్దార్ రుద్రగౌడ్, రెవెన్యూ సిబ్బంది, డీలర్లు పాల్గొన్నారు.
Updated Date - Jun 26 , 2025 | 12:08 AM