ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పకడ్బందీగా సప్లిమెంటరీ పరీక్షలు

ABN, Publish Date - May 10 , 2025 | 12:19 AM

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఆర్వో రామునాయక్‌ తెలిపారు.

అధికారులతో సమీక్షిస్తున్న డీఆర్వో రామునాయక్‌

42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

డీఆర్వో రామునాయక్‌

నంద్యాల ఎడ్యుకేషన్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఆర్వో రామునాయక్‌ తెలిపారు. శుక్రవారం డీఆర్వో కార్యాలయంలో డీఐఈవో సునీత డీఈసీ సభ్యులు రామన్‌, కృష్ణయ్య, ప్రభాకర్‌, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రామునాయక్‌ మాట్లాడుతూ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను జిల్లాలో 42 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తు న్నామన్నారు. ఈనెల 12వతేదీ నుంచి జరిగే ఇంటర్‌ పరీక్షలు ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థులకు 9గంటల నుంచి 12గంటల వరకు, ద్వితీయ సంవత్స రం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు ఉంటాయ న్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలతో మెడికల్‌ కిట్స్‌ ఏర్పాటుచేయాలని వైద్యశాఖ అధికారులను, పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేవిధంగా చూడాలని విద్యుత్‌ అధికారులను, విద్యార్థుల కోసం సకాలంలో ఆర్టీసీ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు.

Updated Date - May 10 , 2025 | 12:19 AM