విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి
ABN, Publish Date - Apr 26 , 2025 | 11:50 PM
విద్యార్థులు కష్ట పడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా ఆకాంక్షించారు.
భావితరాలకు మార్గదర్శకులు కావాలి
కలెక్టర్ రంజిత్ బాషా
పదో తరగతి విద్యార్థులకు సన్మానం
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు కష్ట పడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా ఆకాంక్షించారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కర్నూలు జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధిం చిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 17మంది విద్యార్థులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యా ర్థులను, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులకు కలె క్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం పదో తరగతిలోని విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావాలని ప్రత్యేకంగా కృషిచేశామని, అందుకోసం తీసుకున్న చర్యలతో ఉత్తీర్ణత శాతం పెరిగిం దన్నారు. భావితరాలకు మార్గదర్శకాలు ఉండాలని సూచించారు. పదో తరగతి తర్వాత విద్యార్థులకు మంచి కేరీర్‌ను ఎంచుకునేందుకు వీలుగా, పోటీ పరీక్షలో పాల్గొనడానికి ‘నైపుణ్య’ పేరు శిక్షణా తరగతులు ప్రారం భించామని కలెక్టర్ తెలిపారు. డీఈవో శామ్యూల్‌పాల్ మాట్లాడుతూ జిల్లాలో ఏడుగురు విద్యార్థులు 600మార్కులకు గానూ 597 మార్కులు సా ధించి జిల్లాను అగ్రభాగాన నిలిపారన్నారు. గురుకుల పాఠశాలల కోఆర్డినే టర్ శ్రీదేవి, జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కృష్ణారెడ్డి, పోటీపరీక్షల నిర్వాహకుడు గణేష్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన, అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ శ్రీదేవి, వెల్దుర్తి బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రిన్సిపాల్ సబీనా, విద్యార్థుల తల్లిదండ్రులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Apr 26 , 2025 | 11:50 PM