ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులే కూలీలు

ABN, Publish Date - Jul 10 , 2025 | 11:59 PM

భావి భారతపౌరులు కూలీలుగా మారారు. కూలీలతో చేయించాల్సిన పనులను విద్యార్థులతో చేయించారు.

కుర్చీలు మోసుకెళ్తున్న విద్యార్థులు

ఆత్మీయ సమ్మేళనంలో పిల్లలతో పనులు

కోడుమూరు పీటీఎంలో విద్యార్థులకు పనులు

కోడుమూరు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): భావి భారతపౌరులు కూలీలుగా మారారు. కూలీలతో చేయించాల్సిన పనులను విద్యార్థులతో చేయించారు. కుర్చీలు వేయించారు. చిట్టి చేతులతో కుర్చీలు వేయడం చూసి తల్లిదండ్రులు క్షోభకు గురయ్యారు. గురువారం కోడుమూరు పట్టణంలోని జీవీఆర్‌ జడ్పీ బాలుర ఉన్నతపాఠశాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లలతో కుర్చీలు మోయిస్తుంటే వాళ్ల తల్లిదండ్రులు అవమానంగా భావించి బాధను దిగమింగుకున్నారు. పేదరికంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపిస్తే చదువు చెప్పకుండా ఇలా కూలీలుగా మార్చి పనులు చేయిస్తారా? ఉపాధ్యాయులు పిల్లలతో కూడా ఇలానే చేయిస్తారని సమావేశానికి వచ్చిన కొంత మంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల బంగారు భవిష్యత్తు అంటే ఇదేనా అని పలువురు గుసగుసలాడుకున్నారు.

Updated Date - Jul 10 , 2025 | 11:59 PM